TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నరసన్నపేటలో ధర్మాన బ్రదర్స్ రసవత్తర పోటీ?

Published on: Mon Jun 4, 2012 6:38PM

ap byelections 2012, narasannapeta byelection, dharmana prasada rao byelections, dharmana ramdas byelections, dharmana krishna das byelections, vijayamma narasannapeta byelection, sharmila narasannapeta byelection, tdp candidate narasanna peta bypollశ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ మధ్య పోటీతో రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ప్రధానపోటీ కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్, టిడిపిల మధ్య ఉంది. అయితే మంత్రి ధర్మానప్రసాదరావు ఒక సోదరుడు ధర్మాన రామదాసు కాంగ్రెస్ తరుపున, ఇంకో సోదరుడు మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. ప్రధానంగా వీరిద్దరి మధ్యే పోటీ నడుస్తోంది.

అయితే తెలుగుదేశం పార్టీ తరుపున శిమ్మి స్వామిబాబు పోటీ చేస్తున్నారు. ఈయన కూడా ధర్మానకు సమీపబంధువు. దీంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ అభ్యర్థి రామదాసు తరుపున ప్రచారానికి తన కుటుంబాన్ని మొత్తం రంగంలోకి దించారు. ఆయనతో సమాన బాంధవ్యాలు పాతపరిచయాలు ఉన్న కృష్ణదాసు కూడా తన శక్తియుక్తులకు పణంగా పెట్టి ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కృష్ణదాసు తరుపున ప్రచారబాధ్యతలు చేపట్టి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మిని ఇక్కడికి పంపించారు. ఆమె ప్రచారం మొదలు పెట్టడమే నరసన్నపేట నియోజకవర్గం నుంచి కావటంతో రాష్ట్రం యావత్తూ ఆసక్తిగా ఆ ప్రచారాన్ని గమనించింది. తమ అభ్యర్థికి ఓటెయ్యాలని కోరుతూ వైఎస్ విజయలక్ష్మి ఆమె కుమార్తె షర్మిల ఫ్యాన్ గుర్తును చూపిస్తూ అభ్యర్థించటం కృష్ణదాసుకు ప్లస్ పాయింట్ గా మారిందని పరిలశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్ పై ఉన్న అభిమానాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కృష్ణదాస్ వేసిన పాచికలు పారాయంటున్నారు. దీంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏమైనా సరే రామదాసు గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డెందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీనేతలకు భరోసా ఇచ్చారు. ఆయన తన ప్రసంగంలో కొత్తగా వైఎస్ జగన్ అవినీతిని చేర్చారని సమాచారం. ఇదే నియోజకవర్గం నుంచి బిజెపి తరుపున సంపతరావు తేజేశ్వరరావు, ఇండిపెండెంట్లు బైరి భాస్కరరావు, వాలుయోగేశ్వరరావు పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురు నియోజకవర్గంలో ఓట్లు చీలిస్తే గెలిచే అభ్యర్థి మెజార్టీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.