TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేను ఫైవ్ స్టార్ హోటల్ నడుపుతున్నానా: జగన్

Published on: Mon May 14, 2012 11:34AM

కిరణ్, చంద్రబాబునాయుడు ప్రతిరోజూ జగన్ అది చేశాడు, ఇది చేశాడు, వైఎస్ రాజశేఖరరెడ్డి అది చేశాడు, ఇది చేశాడు అని మాట్లాడడమే తప్ప, మేం ప్రజలకు ఇది చేశాం, ఇది చేయబోతున్నాం అని మాట్లాడే పరిస్థితే లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అవినీతి గురించి మాట్లాడుతున్నారు.. నా ఇంటి గురించి కూడా మాట్లాడారు.. నా ఇంట్లో 74 రూములు ఉన్నాయట. నేను ఈరోజు ఆయన్ను అడుగుతున్నా.. నా ఇంట్లో నేనేమైనా హోటల్ నడుపుతున్నానా..? మీకేమైనా కనిపిస్తుందా..? నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడతారా..?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కై తన కులం, మతం, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.