TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాచర్ల రిగ్గుంగు కుట్ర విఫలం!

Published on: Wed Jun 13, 2012 11:23AM

రిగ్గింగ్ కోసం రెండు పార్టీలు ముందుగా చేసుకున్న ప్రణాళికలకు ఎన్నికల కమీషన్ చెక్ పెట్టింది. అక్రమాలకూ పాల్పడేవారిని వెబ్ కెమెరాల ద్వారా ఈసి అదుపు చేస్తున్నందున వాటి కేబుల్స్ కట్ చేయాలనీ ఆ రెండు పార్టీలు పన్నిన కుట్రను కనుగొన్న ఈసి దాన్ని భగ్నం చేసింది. ముందుగా అందిన సమాచారం మేరకు ఈసి గుంటూరు జిల్లా మాచర్ల పోలింగ్ కేంద్రం వద్ద అధికార్లను అప్రమత్తం చేసింది. ఈపాటికే వెబ్ కెమెరాల వద్ద కేబుల్స్ ఎక్కడైనా కట్ చేశారేమో చూడాలని ఆదేశించింది. దీంతో అధికాలు అప్రమత్తమై జిల్లా ఎన్నికల అధికారిని సంప్రదించారు. ఆయన ఈసి ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఎవరూ వెళ్ళకుండా బందోబస్తు పెంచారు. పారామిలటరీ దళాలను భారీస్థాయిలో పోలింగ్ కేంద్రాల ముందుంచారు. ప్రత్యేకించి వెబ్ కెమెరాల దగ్గరికి ఎవరినీ రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల బందోబస్తు చూసి రిగ్గింగ్ చేద్దామనుకున్న రెండు పార్టీల నేతలు మౌనంగా ఉండక తప్పలేదు. దీంతో ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.