TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎప్పుడూ 'చేయి' దాటడమేనా?

Published on: Wed Jun 13, 2012 11:39AM

ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది మొదలు పోలింగ్ పూర్తయ్యేంత వరకూ కాంగ్రెస్ (హస్తం గుర్తు)పార్టీ నిబంధనల అతిక్రమణలో ముందువరసలోనే ఉంది. ఎప్పుడూ చేయి దాటడమేనా పని అని ఆ పార్టీని తెలుగుదేశం, ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. అలానే వచ్చీరాని తెలుగుమాట్లాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పదే పదే ఎన్నికల కమీషన్ నోటీసులు అందుకున్నారు. ఇక మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఏకంగా హెచ్చరికలే భరించాల్సి వచ్చింది. ఆ తరువాత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఈసి నోటీసులు అందుకున్నవారే. ఇలా వరుసగా కాంగ్రెస్ నేతలు నోటీసులు అందుకుంటుండగానే పోలింగ్ కూడా పూర్తయింది. ఇక పోలింగ్ లో నిలబడ్డ వృద్ధులు, మహిళలలను చూపి అందరు ఓటర్లకు బిర్యానీ ప్యాకెట్లు, టిఫిన్ పోట్లాలు పంపిణీ చేశారు. ఇది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగింది. ముందు నిబంధనలను ఉల్లంఘించినట్లే ఇప్పుడు పోలింగ్ రూల్స్ ను అతిక్రమించిన ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఈ బిర్యానీ ప్యాకెట్ల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదు.