TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విగ్రహాలకు ముసుగులు?

Published on: Tue Jun 12, 2012 10:21AM

ఎన్నికల్లో పాల్గొనే ఓటరును ప్రభావితం చేసే విగ్రహాలకు ముసుగులేయ్యాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. అలానే అభ్యర్థులు గుర్తుల గురించి ప్రచారం చేయరాదని ఆదేశించింది. అదీ పోలింగ్ బూత్ కు వెళ్ళేదారిలో గుర్తులు, విగ్రహాలు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అవసరమైతే జాతీయనాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకూ ముసుగులు వేయాలని సూచించింది. దీని ప్రకారం అన్ని జిల్లాల్లోనూ నేతల విగ్రహాలకు ఈసి ముసుగులు వేయిస్తోంది. ప్రత్యేకించి తక్కువే అనుకున్నా ఎన్టీఆర్ విగ్రహాలకూ, నెహ్రూ విగ్రహాలకూ కూడా ముసుగులు తొడిగించింది. కడపజిల్లా రాయచోటిలో వై.ఎస్.ఆర్. విగ్రహాలకు అధికారులే దగ్గర ఉండి ముసుగులు తొడిగించారు. ఉప ఎన్నికలు జరుగుతున్నా మొత్తం 12 జిల్లాల్లో అదీ 5413 పోలింగ్ బూత్ లకు సమీపంలో ఉన్న విగ్రహాలకూ ముసుగులు తొడిగించాలని ఈసి అధికారులను ఆదేశించింది.