కాంగ్రెస్ కు కలిసొచ్చిన కమ్మ?
Published on: Sun Jun 10, 2012 11:57AM
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్మసామాజిక వర్గం కాంగ్రెస్ కు కలిసోచ్చింది. ఈసారి ఉప ఎన్నికల్లో తమ కమ్మ సామాజికవర్గం మొత్తం కాంగ్రెస్ అభ్యర్ధి తోట త్రిమూర్తులు అనుకూలంగా ఓటు వేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు గరికిపాటి సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు తమ సామాజికవర్గ సమావేశంలో నేతలు నిర్ణయం తెసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ జగన్ ను అరెస్ట్ చేసినందున వై.కా.పా కు మద్దుతు ఇవ్వరాదని నిర్ణయించుకున్నామన్నారు. వై.కా.పా కు వ్యతిరేకంగా అంటే కాంగ్రేస్ కు అనుకూలంగా ఓటు వేయాలని తీర్మానించుకునట్లు చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో కమ్మసామాజికవర్గం రెండు కుడా తోట త్రిమూర్తులుకు అనుకూలంగా ఉంటే రెడ్డిసామాజికవర్గం మాత్రం వై.కా.పా వెనుకే ఉంది. విచిత్రమేమిటంటే వై.కా.పా అభ్యర్ధి, తాజామాజీ పిల్లిసుభాష్ చంద్రబోస్ శెట్టిబలిజసామాజిక వర్గానికి చెందినవారు. ఈ సామాజికవర్గంలో కుడా పెద్ద చీలిక వచ్చింది. సగానికి పైగా, తోటకు అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్దపడ్డారు.


