TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆరేళ్లలో 65 ఉప ఎన్నికలా?

Published on: Wed Jun 6, 2012 1:42PM

ఒక్కసారి ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ళ పాటు అధికారంలో ఉండాలి. ప్రజా ప్రతినిధులు కూడా ఎన్నికైన ఐదేళ్ళ పాటు ప్రజలకు సేవచేయాలి. కాని మన రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించటం లేదు. ఎన్నికైన శాసన సభ్యులు చిన్నచిన్న సాకులతో రాజీనామాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈ ఆరేళ్లలో 65 ఉప ఎన్నికలు జరిగాయి. ఇది ఆల్ టైం రికార్డు. ప్రభుత్వాన్ని కుల్చాలనుకున్నా రాజీనామానే, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండు కోసమూ రాజీనామానే, ఎవరిపై అలిగినా రాజీనామానే, పార్టీలు మారితేనూ రామీనామానే మన ప్రతినిధులు అస్త్రంగా వాడుతున్నారు. దీని పర్యావసానం ఎన్నికల ఖర్చు తడిసి మోపడవుతోంది. ఆ భారాన్ని ప్రజలు పన్నుల రూపంలో భరించాల్సి వస్తోంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్ గా ఉండి చివరికి ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఐదేళ్ల పాటు స్థిరంగా అభివృద్ధి చూపలేని ప్రతినిధులు మనకు అవసరమా అని ఓటరు ఆలోచించాల్సి వస్తోంది. రాష్ట్ర శాసన సభాపతి నాదేండ్ల మనోహర్ తన పదవీకాలం ఏడాది పూర్తయినందున సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల తంతు గురించి విశదీకరించారు. పతినిధులు అన్నవారు నియోజకవర్గ ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన కూడా ఆకాంక్షించారు.