TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

46లక్షల మంది తీర్పు ఎటువైపో?

Published on: Tue Jun 5, 2012 10:07AM

గత నాలుగు దశాబ్దాలుగా దాదాపుగా సర్వేల్లో చెప్పినట్లే ఎన్నికల ఫలితాలున్నాయి. ఈ అనుభవాలతో ఈ సారి ఉప ఎన్నికలకు ముందస్తుగా గెలిచే అభ్యర్థులపై అన్ని పార్టీలు సర్వేలు చేశాయి. ఈ సర్వేల్లో ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. గతంలో మీడియా, ప్రత్యేక సర్వే సంస్థలు మాత్రమే సర్వేలు చేసేవి. ఈ సారి పార్టీలు సర్వే చేయటంతో ఓట్లు డానికి అనుగుణంగా వస్తాయా? రావా? అన్న సందిగ్ధంలో పార్టీలు పడ్డాయి. రాష్ట్రంలోని 18అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో 46 లక్షల 589 మంది ఓటర్లు జూన్ 12న తీర్పును ఇవ్వనున్నారు. వీరి తీర్పు ఎటువైపు ఉంటుందో అన్న ఆసక్తీ ఇటీవల ఎక్కువైంది. సర్వేల ప్రకారం వై.కా.పా.కు ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనాలు వినిపించాయి. అయితే ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని సిబిఐ అరెస్టు చేయటంతో ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్, టిడిపిల వైపు చూస్తున్నారు.