TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేటితో ముగిసిన ఏపి ఉపఎన్నికల ప్రచారం

Published on: Sun Jun 10, 2012 5:57PM

రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగే నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. సాయంత్రం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఎలాంటి ప్రచారమూ చేయరాదని అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో సహా అందరూ ఆదివారం సాయంత్రం 5 తరువాత స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఓటర్లు కాని వారెవరైనా ఉంటే బయటకు పంపించాల్సిందిగా జిల్లా ఎస్పీలను ఆదేశించినట్టు చెప్పారు. ఇందుకోసం హోటళ్లు, అతిథి గృహాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, రెసిడెన్షియల్స్ స్కూళ్ల వంటి వాటిని తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. నిషేధాన్ని అతిక్రమించి ఎవరైనా ఇంటింటి ప్రచారం చేస్తే కేసు నమోదుతో పాటు అరెస్టు కూడా చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ ఏర్పాట్లపై భన్వర్‌లాల్ శనివారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారు. నగదు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంతంగా ఆలోచించి, నచ్చిన అభ్యర్థికి ఓటేయాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూన్ 12 వ తేది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.