TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీళ్ళు మోస్తూ, పచ్చళ్ళు రుబ్బుతున్న అభ్యర్థులు !

Published on: Fri May 25, 2012 12:21PM

ఓట్లు కోసం పాట్లు తప్పవని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ప్రధాన పార్టీల అభ్యర్థులు నిరూపిస్తున్నారు. వీరు చేసే ఫీట్లు చూసి ఓటరు అవాక్కవుతున్నాడు. చెత్తతో కాలుష్యమైన చెరువును చూసిన కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ బాబు వెంటనే చెత్తను ఎత్తేశారు. కార్యకర్తల సహాయంతో చెరువును శుభ్రం చేసేశారు. ఈయనకు నేనేమీ తీసిపోనన్నట్లు తాజామాజీ, వైకాపా అభ్యర్థి సుచరిత అమ్మలక్కలను ఓట్ల గురించి అభ్యర్థించారు. సరిగ్గా ఆమె వచ్చేటప్పటికి మంచినీటి కుళాయిలు వస్తుండటంతో వారితో పాటు ఆమె కూడా బిందెలు మోసేశారు. వీళ్లిద్దరి ఘనకార్యం విన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనేం తక్కువ తిన్నాననుకున్నారో ఏమో!ఇక మహిళలను లేవమని ఏకంగా రుబ్బురోలుతో పచ్చళ్లను రుబ్బేశారు.ఓటేస్తే వీళ్లు రోజూ ఇలానే చేస్తారా? ఎన్నికలయ్యాక దీనికి పదింతలు పని చేయించుకుంటారా? అని ఓటరు అయోమయంలో పడ్డారు. ఒక్కసారి ఓటేసి చూడండి మేమేమి చేస్తామో అని సుధాకర్ బాబు అన్నారు. మాది కూడా ఇదే మాట అని వైకాపా, టిడిపి అభ్యర్థులు రెండు చేతులూ జోడించేస్తున్నారు. ఏమైనా ఇది ఎన్ని"కల" మాయ మరి!