TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల పందేల్లో క్రికెట్ బుకీలు?

Published on: Wed Jun 6, 2012 12:16PM

దేశవ్యాప్తంగా ఐపిఎల్ క్రికెట్ ముగిశాక ఖాళీగా ఉన్న క్రికెట్ బుకీలు ఎన్నికల పందేల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. తెలుగు రాకపోయినా సరే! వెబ్ సైట్ ను ఇంగ్లీషులో ఉంచటంతో దాన్ని వినియోగించుకోవటంలో రాటుదేలిన బుకీలు పందెం విలువను పెంచేస్తున్నారు. రాష్ట్రంలోని 18అసెంబ్లీ, ఒక పార్లమెంటరీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్ లో పెట్టిన తరువాత పందెం కాసేవారిని మెజార్టీ ఓట్ల ఆధారంగా పందెం ఉండాలని బుకీలు సూచిస్తున్నారట. ఓటుకు (కనీసం రూపాయి) విలువ కట్టి మరీ పందెంలో పాల్గొనాలని బుకీలు కోరుతున్నారట. ఇలా బుకీలు ఎన్నికల పందేల్లో బెట్టింగులకు దిగి వెబ్ సైట్ రూపురేఖలను, పందెం విధానాలను శాసిస్తున్నారు. పైగా పందెం కూడా కోట్లలోకి పరుగులు తీస్తోందట. ఇప్పటిదాకా పల్లెటూర్ల నుంచి పెద్దగా పాల్గొనలేదని నిఘావర్గాలు భావిస్తుంటే బుకీలు కాలుమోపాక పల్లెల నుంచి లక్షలు, కోట్లు పందెం సొమ్ముగా వెచ్చించారని సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ బుకీలు క్రికెట్ ను వదిలి మరో రంగం వైపు దృష్టి సారించటం మాత్రం ఇదే ప్రథమమని పోలీసులు అంటున్నారు.