పవన్ జీవితంలో చేసిన ఒక్క మంచిపని అదే....
Published on: Fri Feb 16, 2018 9:39AM

రోజు రోజుకి బీజేపీ హవా తగ్గిపోతున్నా.... ఒకపక్క బీజేపీ పెద్దలు నోరు కంట్రోల్ లో పెట్టుకోమని చెబుతున్నా...బీజేపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. అందరిమీద విమర్శలు గుపిస్తూ హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ సినిమాకు, సినిమాకు మధ్య పాలిటిక్స్ చేస్తున్నారని, ఆయనకు వర్తమాన రాజకీయాలపై ఎంతమాత్రమూ అవగాహన లేదని అన్నారు. పవన్ కల్యాణ్ తన జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచిపని 2014లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచడమేనని, అందుకే ఆయన తన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా అవన్నీ తుడిచిపెట్టుకు పోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.


