ఏపీ బీజేపీ మంత్రుల రాజీనామా...

 

ఏపీలో బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్ రావు, మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశా.. నేను అజాత శత్రువును అని  అన్నారు. ఇంకా సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుతో... నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. చంద్రబాబులా ఎవరూ కష్టపడలేరు.. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అవసరం చాలా ఉంది అని వ్యాఖ్యానించారు.

 

ఇంకా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ... చంద్రబాబుకు నాధన్యవాదాలు.. తప్పని పరిస్థితిల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది.. దేవదాయ శాఖలో మార్పులు తెచ్చేందుకు కృషి చేశా.. పుష్కరాల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోసం రాజ్యసభలో పోరాడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని అన్నారు.