అసెంబ్లీలో జగన్ భాష నీచంగా ఉంది: బిజేపీ సీనియర్ నేత

 

 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక సందర్భంలో విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ "మీరు అప్పుడు గాడిదలు కాస్తున్నారా" అని కామెంట్ చేయడం పై సభలోను బయట కూడా ఈ వ్యాఖ్యల పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే వ్యాఖ్యల పై మాజీ మంత్రి, బిజెపి నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు జగన్తీ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో గాడిదలు అంటూ మాట్లాడడం సబబు కాదని, ఇది నీచమైన భాష అని అయన విమర్శించారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఎవరూ కూడా ఇటువంటి భాషను ఆశించరని, జగన్ తన పదవికి తగినట్లు  హుందాగా వ్యవహరించాలని అయన అన్నారు. ఇక వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  గ్రామ వాలంటీర్ల నియామకంపైనా మాణిక్యాలరావు స్పందించారు. గ్రామ  వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలనే నియమించుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు అన్యాయం చేయాలని చూస్తోందని, ఈ రెండిటికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని అయన స్పష్టం చేశారు.