TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్ వద్ద విభజన పంచాయతీ..

Published on: Sun Mar 26, 2017 1:56PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన వివాదాలను పరిష్కరించేందుకు గవర్నర్ నరసింహన్ నడుం బిగించారు. దీనిలో భాగంగా ఉదయం గవర్నర్ సమక్షంలో ఏపీ, తెలంగాణ మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. ఏపీ తరపున యనమల, అచ్చెన్నాయుడు, విప్ కాల్వ శ్రీనివాసులు..తెలంగాణ నుంచి హరీశ్ రావ్, జగదీశ్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఉద్యోగుల విభజన, విద్యుత్ వివాదంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఏప్రిల్ 17న మరోసారి సమావేశం కావాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి.