విభజనపై కేంద్రం జెట్ స్పీడ్
Published on: Thu Nov 7, 2013 10:02AM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం ప్రక్రియను వేగవంతం చేసినట్లుగానే కన్పిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఐదు పార్టీలతో ఈ నెల 12న కేంద్ర మంత్రుల బృందం సమావేశమవుతుంది. దానికన్నా ముందు ఈ రోజు జీవోఎం ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలోనే జీఓఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందనీ, డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లు రానుందనీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రెండూ కేంద్రం అనుకున్నట్టుగానే జరిగితే, డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాదాపు ఖాయమే కావొచ్చు.


