రూ.105 కోట్లతో హస్తినలో ఏపీ భవన్.!
Published on: Fri Jul 3, 2026 2:28PM

దేశ రాజాని నగరం న్యూ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం 105 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ భవన్ నిర్మాణానికి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఢిల్లీలోని పాత ఏపీ భవన్ ఆస్తుల పంపకం పూర్తయిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ కొత్త ఏపీ భవన్ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్బీసీసీకి అప్పగించింది. ప్రభుత్వ నిర్మాణాల్లో అత్యంత నాణ్యత, పారదర్శకతను పాటించే ట్రాక్ రికార్డ్ ఉన్నందున, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వీలుగా ఎన్ బీసీసీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


