TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుకు ఏపీ భవన్ నోటీస్

Published on: Tue Oct 8, 2013 2:16PM

 

AP Bhawan asks Chandrababu to vacate its premises, AP Bhawan, Chandrababu, Andhra Bhavan, Chandrababu Hunger Strike

 

 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు నోటిసులు ఇచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో చంద్రబాబు నిన్న మధ్యాహ్నం నుండి నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన ఏపీ భవన్ లో దీక్ష చేసేందుకు అనుమతి లేదని, వెంటనే దీక్షా స్థలాన్ని ఖాళీ చేయాలని కోరుతూ ఏపీ భవన్ అధికారులు చంద్రబాబుకు నోటీసు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఏపీ భవన్ లో మీడియా సమావేశానికి మాత్రమే అనుమతి ఉందని, దీక్షకు అనుమతిలేదని చెబుతూ అధికారులు నోటీసు ఇచ్చారు. అయితే ఏపీ భవన్ అధికారుల మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.