లీక్ పై చంద్రబాబు.. నేను చండశాససుడిని..

 

టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వివరణ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తప్పవు...ఘటన జరిగిన నారాయణ స్కూల్లో ఇన్విజిలేటర్లు అందరూ ప్రభుత్వా ఉద్యోగులే...ఘటనలో ఏడుగురిని రిలీవ్ చేశారు.. ఒకరిని సస్పెండ్ చేశారు.. ఇన్విజిలేటర్లు, వాటర్ బాయ్ ఫోన్లను సీజ్ చేశారు అని చెప్పారు. ఈ ఘటన వెనుక వైసీపీ ఉంది..నేను చండశాససుడిని..తప్పుచేస్తే ఉపేక్షించేది లేదు..తప్పు చేస్తే నారాయణ సంస్థలన్నీ వదిలిపెట్టను అని అన్నారు. కావాలని బురద జల్లిన వారిపై చర్యలు తీసుకుంటా..విద్యార్ధులెవరూ టెన్షన్ పడొద్దు అని అన్నారు. జగన్ ప్రతిపక్షనేత కాకపోతే.. పోలీసుల దృష్టిలో ఉగ్రవాది, ఆర్ధిక నేరస్తుడిగా ఉండేవాడు..నేరాన్ని దాచిపెట్టిన వాడు కూడా దోషే అవుతాడు.. తప్పుడు సమాచారమిచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు అని వ్యాఖ్యానించారు.