నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
Published on: Wed Mar 22, 2017 12:38PM
.jpg)
ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. జల సంరక్షణపై చర్చ సందర్భంగా మళ్లీ అధికార పక్షంపై వైసీపీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో చంద్రబాబు ప్రకటను సైతం అడ్డుకొని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ప్రకటన పేరుతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని.. ముఖ్యమంత్రంటే వీళ్లకు గౌవరం లేదు.. అవకాశం ఇస్తామని చెప్పినా వైసీపీ సభ్యులు తమ తీరు మార్చుకోవట్లేదు అని మండిపడ్డారు. ఇంకా స్పీకర్.. పలువురు టీడీపీ నేతలు కూడా వైసీపీ సభ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నాయకుడు మాట్లాడుతుంటే పదే పదే ఎందుకు అడ్డుపడుతున్నారు..? అని స్పీకర్ ప్రశ్నించారు. సభా నాయకుడు ఏం మాట్లాడాలో కూడా మీరే చెబుతారా? అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పదే పదే చెప్పినా వినకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. సభలో జల సంరక్షణపై చర్చించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఇంకా యనమల మాట్లాడుతూ... వైసీపీ సభ్యులు చాలా సమయాన్ని వృథా చేస్తున్నారు.. సభ్యుల ప్రవర్తన ఇలానే ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే...వైసీపీ సభ్యులు రెడ్ టేప్ ఎవరు దాటినా వారిపై వేటు వేయాల్సిందే అని అన్నారు.


