19 నుంచి కాదు 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Published on: Tue Jun 18, 2024 10:28AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగం ఉంటాయని చెబుతున్నారు.
ముందుగా ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సెలవుపై వెళ్లడంతో సమావేశ తేదీలలో మార్పు అనివార్యమైంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులో ఉన్నారు. దీంతో అనివార్యంగా ఏపీ అసెంబ్లీ సమావేశ తేదీలను మార్చాల్సి వచ్చింది.


