ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సందర్శకులకు నో పర్మిషన్!
Published on: Thu Jun 20, 2024 4:49PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది.
సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా ఈ సమావేశాలకు సందర్శకులకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు.
కనీసం ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను సైతం అనుమతించబోమని అన్నారు. స్థలా భావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.


