20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. డిప్యూటీ స్పీకర్ గా కోన రాజీనామా!
Published on: Tue Jun 7, 2022 2:55PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ 20 వ తేదీ నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి సమాచారం.
కాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రాజీ నామా చేస్తారని చెబుతున్నారు. ఆయన స్థానంలో కోలగట్ల వీరభద్రస్వామి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయిన సంగతి విదితమే. దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది.
ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, షెడ్యూల్, సభలో ప్రవేశపెట్టనున్న బిల్లలు తదితర అంశాలను జగన్ గవర్నర్ కు వివరించారని అంటున్నారు. అలాగే ఇటీవల కోససీమలో అల్లర్లు, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వంతీసుకున్నచర్యలు వంటి అన్ని అంశాలనూ ఈ భేటీలో జగన్ గవర్నర్ కు వివరించారు. అయితే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


