TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిసెంబరు 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!

Published on: Thu Nov 28, 2013 11:17AM

 

 

 

డిసెంబరు మొదటివారంలో అసెంబ్లీ సమావేశపరచడానికి కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ వడివడిగా జరుగుతున్న నేపధ్యంలో... డిసెంబరు 20లోపు అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. డిసెంబరు 5 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలు కూడా 20వ తేదీనే ముగియనున్నాయి. అయితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు రావాలంటే డిసెంబరు 20 లోపు అసెంబ్లీలో చర్చించి, అభిప్రాయాలను పార్లమెంటుకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసమే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌కు, సిఎంకు ఉన్నతస్థాయిలో సూచనలు అందినట్లు తెలిసింది.

 


అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం శాసనసభ పరిసరాలను తనిఖీ చేశారు. అసెంబ్లీ అవరణలో పాములు తిరుగుతున్నాయన్న కలకలం రేగడంతో ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించారు. పాములు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు.