TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆక్వా ఫుడ్ పార్క్ ప్రమాదంపై మళ్లీ దద్దరిల్లిన అసెంబ్లీ...

Published on: Fri Mar 31, 2017 10:48AM

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఈ రోజు వరకూ... ఏరోజూ సభ సవ్యంగా జరిగింది లేదు. ఏదో ఒక విషయంపై అధికారపక్ష, విపక్ష నేతల మధ్య మాటల యుద్దాలే జరిగాయి. పోలవరం ప్రాజెక్టు అంశం, అగ్రిగోల్డ్ అంశం, టెన్త్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశం ఇప్పటి వరకూ పలు అంశాలపై ఇరుపక్ష నేతలు వాగ్వాదాలు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. అదే అక్వా ఫుడ్ పార్క్ గురించి. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో అక్వా ఫుడ్ పార్క్ లో  రసాయనిక ట్యాంకును శుభ్రం చేస్తుండగా.. విషవాయువులు వెలువడి ఐదుగురు కార్మికులు మరణించారు. ఇప్పుడు దీనిపై చర్చించాలని  ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఇచ్చింది. అయితే, ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ఆ అంశంపై చర్చిద్దామని స్పీకర్ చెప్పినా వినని వైసీపీ సభ్యులు మొద‌ట దానిపైనే చ‌ర్చించాల‌ని  గంద‌రగోళం సృష్టించారు. స్పీకర్ పోడియం ఎక్కి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు.