TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కు సవాల్..శరణమా..? రణమా..?

Published on: Fri Mar 24, 2017 1:22PM

 

సమయం లేదు మిత్రమా శరణమా..? రణమా..? అన్న బాలకృష్ణ డైలాగ్ ను మరోసారి గుర్తుచేశారు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ పార్టీ నేతల మధ్య అగ్రిగోల్ట్ అంశంపై పెద్ద ఎత్తున మాటల యుద్దం కొనసాగుతుంది. నిన్న అసెంబ్లీలో మొదలైన ఈ రచ్చ ఈరోజు కూడా కొనసాగుతుంది. అధికారపక్ష, విపక్ష నేతలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ ఆధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడంతో అసలు రచ్చ మొదలైంది. జగన్ చేసిన వ్యాఖ్యలకు గాను స్పందించిన ప్రత్తిపాటి జగన్ కు సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ ఆస్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపించినట్టయితే తాను రాజకీయాలనుండి తప్పుకుంటానని.. ఒకవేళ జగన్ నిరూపించలేకపోతే రాజకీయాలనుండి తప్పుకుంటారా అని..? సవాల్ విసిరారు. అంతే అప్పటి నుండి దీనిపై సభలో ఆందోళనలు తలెత్తుతూనే ఉన్నాయి. ఒకపక్క జగన్ ఎలాగైనా సవాల్ ను స్వీకరించాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, సభా సమయం ఇప్పటికే చాలా వృథా అయిందని, విచారణ జరిపించి నిజాన్ని వెలికితీస్తే, తప్పు ఎవరిదైతే వారు రాజీనామా చేయాలన్న సవాల్ ను జగన్ అంగీకరించాలని డిమాండ్ చేశారు."నేను చాలా సూటిగా ప్రతిపక్ష నాయకుడిని అడుగుతున్నాను. సమయం లేదు జగన్ గారూ... మీరు శరణమా? సమరమా? ఏదో ఒకటి చెప్పండి. మీరు ఈ సభకు క్షమాపణ చెబుతారా? ఎంక్వైరీకి ఒప్పుకుంటారా? ఏదో ఒకటి చెప్పండి అని అన్నారు. మరి ఇంతమంది డిమాండ్ చేస్తున్నా జగన్ సవాల్ స్వీకరిస్తారో... లేదో...? చూద్దాం.