TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ అసెంబ్లీలో రచ్చ....'బయటకు రారా తేల్చుకుందాం'

Published on: Fri Mar 24, 2017 12:06PM

 

ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. అగ్రిగోల్డ్ అంశంపై ఇప్పటికే రచ్చ జరగగా..ఇప్పుడు తాజాగా నోటుకు ఓటు అంశం కూడా ఈరోజు తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. ఓటుకు నోటు అంశంపై వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకానొక సమయంలో ఇరు పార్టీల సభ్యులు అదుపు తప్పారు.  పరిస్థితి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అర్థం పర్థం లేకుండా గొడవ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు కూడా 'బయటకు రారా తేల్చుకుందాం' అంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో, చెవిరెడ్డికి మద్దతుగా ఆపార్టీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వెళ్లారు. చింతమనేనికి అండగా వల్లభనేని వంశీ, ప్రభాకర్ చౌదరిలు నిలిచారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.