TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ అసెంబ్లీ ప్రారంభం...ప్రతిరోజూ సరికాదు...

Published on: Fri Mar 24, 2017 10:20AM


ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న అగ్రిగోల్డ్ విషయంలో సభ వాడివేడిగా.. సవాళ్ల పర్వం మధ్య సాగగా.. ఈ రోజు కూడా అదే అంశంపై చర్చ జరగుతుంది. అయితే వైసీపీ సభ్యులు మాత్రం వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని కోరుతూ ఆందోళనలు చేపట్టారు. ఆ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు ప్రతిరోజూ సభను అడ్డుకోవడం సరికాదని....  బీఏసీలో చర్చించిన ప్రకారం సమావేశాల నిర్వహణకు సహకరించాలని కోరారు.ప్రశ్నోత్తరాలకు అడ్డుతగిలి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దని సూచించారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటంతో రాష్ట్రం పరువు పోయిందని వ్యాఖ్యానించారు.