TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పై చంద్రబాబు ఫైర్... సభలో ఒక్కరే ఉండాలి...

Published on: Thu Mar 23, 2017 3:35PM

 

ఏపీ అసెంబ్లీలో అగ్రిగోల్డ్ అంశంపై ప్రతిపక్ష, విపక్ష నేతలు సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబసభ్యులకు  సంబంధం ఉందని ప్రతిపక్ష నేత ఆరోపించడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యాలకు స్పందించిన ప్రత్తిపాటి తన ఆస్తులకు.. అగ్రిగోల్డ్ తో సంబంధం ఉంటే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. నిరూపించకపోతే జగన్ రాజకీయాలనుండి తప్పుకుంటారా..? అని సవాల్ చేశారు. అంతేకాదు అగ్రిగోల్డ్ అంశంపై సభాసంఘం వేసినా అభ్యంతరం లేదని అన్నారు. దీనికి గాను జగన్ మాట్లాడుతూ... సభాసంఘం వేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.. ప్రత్తిపాటి కొన్న భూములపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయండి.. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని అన్నారు.

 

ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తుల విషయమై జ్యుడీషియల్ విచారణ జరిపించేందుకు సిద్ధమని, ఒకవేళ విచారణ తరువాత ప్రత్తిపాటి పుల్లారావు తప్పుందని తేలితే, ఆయన్ను సభ నుంచి వెలేస్తానని, ఆరోపణల్లో నిజం లేదని రుజువైతే, జగన్ ఇక జీవితంలో సభకు రాకూడదని, ధైర్యముంటే తన సవాల్ ను అంగీకరించాలని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో డిమాండ్ చేశారు. "ఈ హౌస్ లో ఎవరైనా ఒకరే ఉండాలి, ఉంటే ప్రత్తిపాటి, లేదంటే జగన్ ఉండాలి. విచారణ వేసి తేలుద్దామా? నా మాటలకు జగన్ అంగీకరించే పక్షంలో జ్యుడీషియల్ విచారణకు ఈ క్షణమే ఆదేశిస్తున్నా" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి జగన్ ఈ సవాల్ స్వీకరిస్తారో..లేదో.. చూద్దాం.