అసెంబ్లీలో సవాళ్ల పర్వం...
Published on: Thu Mar 23, 2017 1:21PM
.jpg)
అగ్రిగోల్డ్ అంశం చర్చపై మరోసారి అసెంబ్లీలో ఆందోళనలు మొదలయ్యాయి. అగ్రిగోల్డ్ అంశం పై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం నెలకొంది. అగ్రిగోల్డ్ అంశంపై మాట్లాడిన జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ కు లింక్ లేని ప్రాపర్టీనే కొన్నాను.. నేను కొన్న భూములకు, అగ్రిగోల్డ్ కు ఎలాంటి సంబంధంలేదు..నేను చెప్పింది తప్పయితే రాజకీయాల నుండి తప్పుకుంటా.. నిరూపించకపోతే జగన్ రాజకీయాలనుండి తప్పుకుంటారా..? అని సవాల్ చేశారు. అంతేకాదు అగ్రిగోల్డ్ అంశంపై సభాసంఘం వేసినా అభ్యంతరం లేదని ప్రత్తిపాటి ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనికి గాను స్పీకర్ కోడెల కల్పించుకొని.. సవాల్ స్వీకరిస్తారో.. లేదో సమాధానం చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు.
ఇక దీనిపై జగన్ మాట్లాడుతూ... సభాసంఘం వేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.. ప్రత్తిపాటి కొన్న భూములపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయండి.. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని అన్నారు.


