TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు భరోసా..

Published on: Thu Mar 23, 2017 12:46PM


అగ్రిగోల్డ్ బాధితులు అధైర్యపడవద్దు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్ అంశంపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నుండి మా ప్రభుత్వానికి వారసత్వంగా చాలా కేసులు వచ్చాయి.. అగ్రిగోల్డ్  కేసు కూడా అలా వచ్చిందే.. ఎక్కువ వడ్డీ ఆశచూపి డబ్బులు వసూలు చేశారు... రాష్ట్రంలో 19 లక్షల మంది డిపాజిట్ దారులు ఉన్నారు...రాష్ట్రం నుండే 4 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు అని వ్యాఖ్యానించారు అంతేకాదు.. అగ్రిగోల్డ్ పై 2014 లోనే కేసు నమోదైంది.. 2015 జనవరి 5న సీబీసీఐడీకి కేసును అప్పగించాం.. అగ్రిగోల్డ్ బాధితులు అధైర్యపద్దు.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. 3 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. వైట్ కాలర్ నేరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.  అగ్రిగోల్డ్ కేసును సీబీఐకు అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.