TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్...

Published on: Thu Mar 23, 2017 10:21AM

 


గత రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చల కంటే గందరగోళమే ఎక్కువ జరిగింది. అధికారపక్ష, విపక్ష నేతల మధ్య మాటల యుద్దాలు జరిగాయి. దీంతో రెండు రోజులుగా చర్చలు సరిగ్గా జరగనేలేదు. ఇక ఈరోజు ప్రారంభమైన సమావేశాల్లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్వచ్ఛన్ అవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాయిదా తీర్మానం ప్రారంభించాలని కోరగా, పోలవరం ప్రాజెక్టు కుడికాలువకు సంబంధించిన పనులపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటన చేసేందుకు సిద్ధం కాగా వెంటనే వైసీపీ నేతలు పోడియం వద్దకు దూసుకెళ్లి.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు  'ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈరోజు కూడా సభలో ఆందోళనలే మిగిలాయి.