ఏపీ అసెంబ్లీ వద్ద యువతి ఆత్మహత్యాయత్నం...
Published on: Wed Mar 15, 2017 2:57PM

ఏపీ అసెంబ్లీ వద్ద కలకలం రేగింది. ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళానికి చెందిన కళ్యాణి నాలుగో తరగతి ఉద్యోగినిగా పనిచేస్తోంది. తనకు కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు వేతనం ఇవ్వటం లేదని.. దీనిపై సీఎంను కలిసేందుకు ఆమె వెలగపూడిలోని అసెంబ్లీ వద్దకు వచ్చింది.. అయితే లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది వెంటనే స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాగా గతంలో కూడా ఈమె ఇలాంటి ఘటనకే పాల్పడినట్టు తెలుస్తోంది.


