TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌, కేసీఆర్‌ ల ఢిల్లీ పర్యటన రద్దు.. ఎందుకంటే?

Published on: Thu May 30, 2019 3:31PM

 

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ నూతన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దైంది. వీరిద్దరికీ ఢిల్లీలో రాత్రి 7 గంటలకు జరిగే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు ముందే అందాయి. దీంతో జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని భావించారు. అయితే ఢిల్లీలో విమానం ల్యాండింగ్‌కు అనుమతిలేని కారణంగా వీరిద్దరి పర్యటన రద్దయింది. షెడ్యూల్‌లో లేని విమానాల ల్యాండింగ్‌కు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అనుమతులు రద్దు చేసింది. మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షెడ్యూల్‌లో లేని ప్రత్యేక విమానాల ల్యాండింగ్ అనుమతులను పౌరవిమానయాన శాఖ రద్దు చేసింది. దీంతో ఇద్దరు తెలుగు సీఎంలు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.