TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎఒబిలో మావోయిస్టు నేత ఆర్ కే?

Published on: Sat Mar 24, 2012 10:42AM

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్ కె ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో మావోయిస్టులతో జరిగిన చర్చల్లో రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. అప్పట్లో ఈ చర్చల్లో పాల్గొన్న ప్రముఖ మావోయిస్టు నేతలు చాలామంది తరువాత ఎన్ కౌంటర్ కు బలయ్యారు. ఆర్ కె ఆచూకీ మాత్రం ఇప్పటిదాకా తెలియలేదు. అయితే ఇటీవల ఆయన ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు దళ సభ్యురాలు తుపాకుల రామాంజమ్మ, మందా మోహన్ లు ఇచ్చిన సమాచారం మేరకు రామకృష్ణ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు.