మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత
Published on: Thu Aug 1, 2024 12:41AM
భారత మాజీ క్రికెటర్, భారత క్రికెట్ జట్టుకు మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (71) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అన్షుమన్ గైక్వాడ్ 1974-1987 మధ్యకాలంలో భారత జట్టు తరఫున 40 టెస్టు మ్యాచ్‌లు, 15 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత భారత జట్టుకు రెండుసార్లు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. 1997-1999 మధ్యకాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించారు. అన్షుమన్ గైక్వాడ్ కోచ్‌గా వున్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు రన్నర్ అప్‌గా నిలిచింది.


