TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టాస్ గెలిచిన ఇంగ్లండ్...భారత్ జట్టులోకి కొత్త బౌలర్

Published on: Wed Jul 23, 2025 4:01PM

 

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్- భారత్ మధ్య నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా టీమిండియా జట్టులోకి కొత్త పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేశారు.  హర్యానాకు చెందిన అన్షుల్  దేశవాళీ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు.  ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్‌కు దూరం కాగా, యువ పేసర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. 

అదే సమయంలో వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్ స్థానంలో యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ తుదిజట్టుకు ఎంపికయ్యాడు. శార్దూల్ ఠాకూర్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు.అటు ఇంగ్లండ్ జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది. గాయపడ్డ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ లియామ్ డాసన్ ను ఎంపిక చేశారు. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.

భారత జట్టు
శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్.

ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.