Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహారాష్ట్రలో కాంగ్రెస్ కు మరో షాక్!
posted on: Nov 25, 2024 2:05PM

మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అసలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయంతో కుంగిపోయి ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మరో షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత అంటూ పీసీపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్) లతో కూడిన మహావికాస్ అఘాడీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఓటమితో అసలే షాక్ లో ఉన్న కాంగ్రెస్ కు రాష్ట్ర అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేయడం మరింత కుంగదీసింది. ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న వేదుకులాటలో పార్టీ ఉంది.






