బిఆర్ఎస్ కు మరో షాక్... పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి
Published on: Fri Jun 21, 2024 11:50AM
తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. బిఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తెలంగాణలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. అసెంబ్లీ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. తాజా రాజకీయాలపై చర్చల అనంతరం పోచారంను కాంగ్రెస్లో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైనట్టేనని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పోచారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.


