జీబీఎస్ వ్యాధితో గుంటూరులో మరొకరు మృతి
Published on: Thu Feb 20, 2025 11:15AM
గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) వ్యాధితో గుంటూరులో మరో మహిళ మృతి చెందారు. వ్యాధి లక్షణాలతో ఈ నెల 2న జిజిహెచ్ ఆస్పత్రిలో చేరిన షేక్ గౌహర్ జాన్ బుధవారం రాత్రి మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
ఇదే వ్యాధి లక్షణాలో ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. జీబీఎస్ బారిన పడి ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ వ్యాధి లక్షణాలతో జిజిహచ్ లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.


