హైదరాబాద్ లో మరో కొత్త వైరస్....నోరో వైరస్ తో అప్రమత్తం  

posted on: Jul 27, 2024 2:54PM

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించి. కరోనా మహమ్మారి వల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారు. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ తెలంగాణ రాజధాని వాసులపై బాంబు పడ్డంత పనైంది. 
హైదరాబాద్ నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాపించే నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు జారీ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భాగ్యనగరవాసులకు సూచనలు చేసింది.
'నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త!! కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.' అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ నోరో వైరస్ లక్షణాలు అని పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి. 
ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...