ఏపీలో మరో కొత్త పార్టీ.. జనసేనకు ఎఫెక్ట్.!!
Published on: Tue Jul 31, 2018 4:28PM
పార్టీలు ఎన్ని ఉన్నా కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే ఉంటాయి.. ఏపీలో గత ఎన్నికల్లో ప్రధాన పోటీ టీడీపీ,వైసీపీ మధ్యే నడిచింది.. బీజేపీ, జనసేన కూడా టీడీపీతోనే కలిసి నడిచాయి.. ఇక కాంగ్రెస్, విభజన ఎఫెక్ట్ తో ఏపీలో అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.. ఇవన్నీ అప్పటి మాటలు.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. బీజేపీ, జనసేనలు టీడీపీకి వ్యతిరేకమై వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకి సిద్ధమయ్యాయి.. కాంగ్రెస్ పాత నాయకులని కలుపుకొని పోతూ కొత్త ఉత్సాహంతో వచ్చే ఎన్నికలవైపు అడుగులు వేస్తోంది.. అయితే ఈసారి ఏపీలో టీడీపీ, వైసీపీ,జనసేనల మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పుడిప్పుడే తిరిగి బలపడే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్, వైసీపీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. వైసీపీ మాదిరిగానే జనసేనకు కూడా ఇప్పుడు ఇలాంటి సమస్యే రానుంది.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలో సొంత రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది.. జనసేనకు కాపు సామజిక వర్గ ఓట్లు భారీగా పడే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.. అయితే ఇప్పుడు కాపు ఉద్యమనేత ముద్రగడ పార్టీ పెడితే జనసేనకు పడాల్సిన ఆ సామజిక వర్గ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. చూద్దాం మరి ముద్రగడ నిజంగా పార్టీ పెడతారో లేదో?.. ఒకవేళ పెడితే జనసేన ఏ మేరకు ఎఫెక్ట్ అవుతుందో?.. ఇవి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.


