TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరులో మరో కి‘లేడీ’ బాగోతం బట్టబయలు

Published on: Sat Jun 20, 2026 12:31PM

నెల్లూరు జిల్లాలో  తన అందం,   మాటల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ, లక్షల రూపాయలు కాజేస్తున్న ఒక కి‘లేడీ’ బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.  బత్తల రజిత అలియాస్ రమ్య అనే మహిళ సాగించిన ఈ మోసాల పరంపర జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం మాటల గారడీతోనే కాకుండా, తప్పుడు పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులతో ఆమె చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.  

బత్తల రజిత నెల్లూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ధనవంతులు, వ్యాపారులు,   రియల్ ఎస్టేట్ వ్యాపారులను  టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడేది. నగరంలోని వీఆర్సీ సెంటర్ సమీపంలో, అలాగే  రూరల్ పరిధిలో ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని తన దందా సాగించింది. తనకు పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులతో పరిచయాలు ఉన్నాయని, తక్కువ ధరకే ప్రభుత్వ భూములు ఇప్పిస్తానని నమ్మబలికేది. ఈ క్రమంలోనే సుమారు నలుగురి నుంచి   45 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం భూముల పేరిట మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరో ముగ్గురు నిరుద్యోగుల నుండి ఒక్కొక్కరి వద్ద  3  5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి వారికి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు కూడా సృష్టించి ఇచ్చింది.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన  పోలీసులు బత్తల రజితను  నెల్లూరు శివారులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుండి  12.5 లక్షల రూపాయల నగదు,  పాటు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 నకిలీ ఐడీ కార్డులు, మోసాలకు ఉపయోగించిన రెండు  స్మార్ట్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆమెపై గతంలోనూ ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల్లో రెండు వేర్వేరు చీటింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన కిలేడీ రజితను  కోర్టులో హాజరుపరచగా కోర్టు  14 రోజుల రిమాండ్‌ విధించింది.