TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలలో మరో ఎన్నికల నోటిఫికేషన్

Published on: Mon Mar 3, 2025 10:10AM

ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. రెండు రాష్ట్రాలలో కలిపి 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం (మార్చి 3) నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిషికేషన్ వెలువడింది.

ఈ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ( మార్చి 3) నోటిఫికేషన్ విడుదల చేసింది.  నామినేషన్లు దాఖలుకు మార్చి పది తుదిగడువు కాగా, 11న పరిశీలన ఉంటుంది. నామానేషన్ల ఉపసంహరణకు మార్చి 13 చివరి తేదీ కాగా మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఫలితాల విడుదల ఉంటుంది.

  తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హాసన్‌ల పదవీకాలం ముగుస్తున్నది. వీరి పదవీ కాలం ముగియడంతో ఏర్పడే ఖాళీలకే ఇప్పుడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్  విడుదల చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్‌బాబు, బి.తిరుమలనాయుడుల పదవీ కాలం కూడా ముగుస్తున్నది. వీరిలో జంగా కృష్ణమూర్తిపై ఇప్పటికే మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు.