TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్ పై మరో కేసు!

Published on: Sat Jun 14, 2025 9:58AM

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసింది.  ఈ కేసుకు సంబంధించి ఆయన సోమవారం (జూన్ 16) సోమవారం  విచారణకు హాజరు కానున్నారు.   అదలా ఉంటే తాజాగా కేటీఆర్ పై మరో  కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారనీ బల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో కేటీఆర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ  పేర్కొన్నారు. ఫిర్యాదుతో పాటు కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా ఆయన పోలీసులకు అంద చేశారు. దీంతో కేటీఆర్ పై పైబర్ క్రైం పోలీసులుఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో కేటీర్ కు నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.