TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నవరంలో పురాతన తామ్ర యంత్రం అదృశ్యం ?.

Published on: Mon Apr 9, 2012 3:02PM

 ఒక ఆలయం నిర్మించాలంటే దానికి ముందుగా యంత్రం గీయించేవారు. అటువంటి యంత్రాలు లేకుండాఆలయమే నిర్మించరు. పురాతన ఆలయాల విషయంలో ఈ యంత్రాలే కీలకపాత్ర పోసిస్తుంటాయి. సాక్షాత్తు  అన్నవరం శ్రీరమాసహితసత్యనారాయణ స్వామి దేవాలయం నిర్మాణానికి ముందు స్వామివారే స్వయంగా తామ్రయంత్రాన్ని నిర్మించమని ఆదేశించారని చరిత్ర చెబుతోంది. అయన ఆదేశాల ప్రకారం అప్పట్లో ఆలయాన్నినిర్మించారని పూర్వికులు ధ్రువీకరించారు. అంతటి ప్రాశస్త్యం  ఉన్న ఆలయంలో చిన్న చిన్న భీటలు కనిపించాయి. దీన్ని సాకుగా చూపి మూలవిరాట్ ను వేరేప్రాంతములో పెట్టి ఆలయాన్ని నిర్మించారు.అయితే పూర్వం ఆలయాన్నినిర్మించిన సమయంలో మూలవిరాట్ విగ్రహం క్రింద తాపడం చేసిన తామ్ర యంత్రం ఆచూకి ఏమైందోతెలియడంలేదు. అసలు ఈ తామ్ర యంత్రం లభించిందా ?. ఒకవేళ లభిస్తే దానిని కొత్త ప్రదేశంలో స్వామిని ప్రతిష్టించే ప్రదేశంలో తాపడం చేశారా ?. అన్న విషయాలను అత్యంత గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు దేవాలయ మరమత్తుల ఫేరిట ముల విరాట్ ను వేరే చోటకు తరలించడం పై కూడా వేద పండితుల  అభ్యంతరాలు వ్వక్తం చేశారు. అయితే వీరి అభ్యంతరాలను ఆలయ అధికారులు, పాలక వర్గం ఖాతరు చేయలేదు. ఆలయ నిర్మాణం కోసం ఇ.వో  శ్రుంగేరిమఠానికి మూడుసార్లు వెళ్ళారు. ఆ మఠాధిపతి సలహాల మేరకే ఈ నిర్మాణం జరిగిందని, వాస్తుకు పెద్దపీట వేశామనీ ఆయన బహిరంగంగా ప్రకటించారు. అద్యాత్మిక వాదులు ఎవరూ ప్రశ్నించకూడదని కాబోలు ఆలయ ప్రారంభోత్సవానికి ముందుగా స్వామిజీలపర్యవేక్షణలో ఇఓ దగ్గర ఉండి మరీ యాగాలు కూడా చేయించారు. అన్నవరం ఆలయం నిర్మాణం పూర్తి అయినప్పటికి తామ్ర యంత్ర ఉనికి వెలువడుతూనే ఉన్నాయి.