TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నాబృందంపై ఖురేషీ కన్ను,చట్టాన్ని ఉల్లంఘించలేదు

Published on: Mon Dec 26, 2011 12:29PM

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నా టీమ్‌ వ్యవహారశైలిని పరిశీలించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ చెప్పారు.ఓ జాతీయ టీవీ చానెల్‌తో ఆయన  మాట్లాడుతూ  ఒక పార్టీకి వ్యతిరేకంగా సమస్య కావచ్చునని ఆయన అన్నారు.  అందరి విషయంలో వ్యవహరించినట్లుగా తాము అన్నా జట్టు సభ్యుల విషయంలో వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు వారు ఏ విధమైన ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఫలానా పార్టీకి ఓటేయాలని చెప్పలేదని ఆయన అన్నారు.తాము ఫలానా పార్టీని బహిష్కరిస్తామని మాత్రమే అన్నా సభ్యులు చెప్పారని, చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడనప్పటికీ ప్రొప్రైటీ సమస్య తలెత్తవచ్చునని వారికి చెప్తామని ఆయన అన్నారు. మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ శాసనసభా ఎన్నికలు జనవరి 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. పటిష్టమైన జన లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ అన్నా హజారే యుపిఎ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.