అన్నా అనారోగ్యం..ప్రచారంలో పాల్గొనరు : కిరణ్‌బేడీ
Published on: Thu Jan 5, 2012 1:06PM
న్యూ
ఢిల్లీ : అన్నా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపద్యంలో అన్నా హజారే ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయరని అన్నా బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ గురువారం ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు తేనందుకు నిరసనగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేస్తానని గతంలో అన్నా ప్రకటించిన విషయం తెలిసిందే.


