TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హజారే ఆరోగ్యం పై సర్వత్రా ఆందోళన

Published on: Mon Jan 2, 2012 12:09PM

హైదరాబాద్: చాతి ఇన్ఫెక్షన్ కారణంగా ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే ఆస్పత్రిలో చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని అన్నా హజారే వెల్లడించారు. కానీ చికిత్స చేసిన వైద్యులు మరో నెల రోజుల వరకూ ఎలాంటి దీక్షలు చేయకూడదని హజారేకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడిన హజారే తన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. ‘నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని ప్రజలు భావిస్తున్నారు. అలాంటిదేమీ లేదు’అని తెలిపారు. గత బుధవారం ముంబయిలో అర్థంతరంగా తన దీక్షను విరమించిన తర్వాత హజారే మాట్లాడటం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

కాగా, లోక్‌పాల్ బిల్లులోని లోకాయుక్త అంశంపై తృణమూల్ కాంగ్రెస్ తన వైఖరిపట్ల దృఢంగా ఉంది. దేశంలో అవినీతి నిర్మూలనకు బలమైన లోక్‌పాల్ వ్యవస్థ అవసరమే కానీ రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య వ్యవస్థ విషయంలో మాత్రం ఎటువంటి రాజీలేదని పార్టీ స్పష్టం చేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించే విషయంలో తమ పార్టీ రాజీపడదు. కనుక మా పార్టీ సూచించిన సవరణలు అంగీకరించాల్సిందే’ అని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు ముఖుల్ రాయ్ అన్నారు. ముంబైలో హోం మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలకు తృణమూల్ పార్టీ స్పష్టం చేసింది. కాగా తృణమూల్ లోకాయుక్తపై సూచించిన సవరణలన్నీ చేయడం కష్టమని ఒకటి రెండు సవరణలను ఆమోదించే అవకాశం ఉందని చిదంబరం చెప్పిన సంగతి తెలిసిందే.