అన్నా బృందం విజ్ఞప్తిని తోసిపుచ్చిన హజారే
Published on: Wed Dec 28, 2011 8:23AM
న్యూ
ఢిల్లీ: పటిష్టమైన లోక్పాల్ బిల్లు కోరుతూ హజారే మూడు రోజుల దీక్షకు దిగారు. అయితే, దీక్షా శిబిరంలో కూర్చొన్న కొన్ని గంటలకే హజారే జ్వరంతో బాధపడ్డారు. దీంతో తక్షణమే దీక్షను ముగించాలని అన్నా బృందానికి చెందిన సభ్యులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీలు హజారేకు విజ్ఞప్తి చేశారు. అయితే, హజారే మాత్రం బృందం సభ్యులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి, దీక్షను యధావిధిగా కొనసాగిస్తానని వారికి చెప్పారు. దీనిపై కిరణ్ బేడీ మాట్లాడుతూ హజారే జ్వరంతో బాధపడుతున్నారు. అందుకే దీక్షను తక్షణం విరమించాలని ఆయనను కోరాం. కానీ, తన దీక్షను యధావిధిగా కొనసాగిస్తానని అన్నా తెలిపారన్నారు. 74 యేళ్ళ ఈ గాంధేయవాది గత కొన్ని రోజులుగా వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పటికీ.. ఆయన వ్యక్తిగత సహాయకుడు సురేష్ పథారే మాత్రం హజారే ఆరోగ్యంగా ఉన్నారని ముందుగా ప్రకటించినట్టుగా దీక్షలో కొనసాగిస్తారని చెప్పారు.


